కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతున్నది. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం భూములు, ఇండ్లు, ప్లాట్ల విలువలు, చార్జీలు పెంచిన తర్వాత రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సందడి తగ్గింది

ప్రస్తుతం అత్యవసర అవసరాల కోసం చేసే మార్టిగేజ్ (తనఖా) రిజిస్ట్రేషన్లు తప్పా మిగతా లావాదేవీలు మందగించాయని రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో రిజిస్ట్రేషన్లు తగ్గడంతో కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. భూమి కొనుగోలు చేసినప్పుడు మారెట్ విలువతో పాటు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, ట్రాన్స్ఫర్ డ్యూటీ తదితర చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం చార్జీలు పెంచడంతో లక్షల విలువైన స్థలాలపై వేల నుంచి లక్ష వరకు అదనపు భారం పడుతోంది.
