
(శ్రీరామ్ చక్రి టీవీ) టుడే న్యూస్ | 21-06-2026జిల్లెలగూడలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
జిల్లెలగూడ చందన చెరువు వద్ద సత్యం యోగా సెంటర్, సబితమ్మ శక్తిదళ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.మీర్పేట్ GHMC 60వ డివిజన్ పరిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు, యువతతో పాటు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా సాధన చేశారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.”ఆరోగ్యమే మహా భాగ్యం” అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యోగా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చని మాజీ కార్పొరేటర్ ఎనుగుల అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో యోగా గురువులు సత్యం, ఆకుల శ్రీనివాస్, లక్ష్మారెడ్డి, డాక్టర్ శంకర్ కుమార్, మేకల కృష్ణ ముదిరాజ్, నాగయ్య ముదిరాజ్, మాజీ కార్పొరేటర్ ధనలక్ష్మి రాజ్ కుమార్, మాజీ టెంపుల్ డైరెక్టర్ మేకల యాదగిరి, కాంటెస్టెడ్ కార్పొరేటర్లు అబ్బనమోని గోపి యాదవ్, బొమ్మకంటి దయానంద్ ముదిరాజ్, కాంటెస్టెడ్ ఎంపీటీసీ కర్రే వెంకటేష్ కురుమ, ఉద్యమ నాయకులు ఉట్కూర్ నవీన్, కేతరాజు శంకర్, ఐతరాజు వెంకటేష్, నాయకులు వద్ది రజనీకాంత్ ముదిరాజ్, శివకృష్ణ ముదిరాజ్, చందు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
