తెలంగాణలో ఎం బీఏ, ఎంసీఏ కోర్సులో ప్రవేశానికి నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన టీజీ ఐసెట్-2026 ఫలితాలు శుక్రవారం హైదరాబాద్లోని రాష్ట్ర ఉన్నత విద్యా మండలిలో విడుదల చేశారు.

రామగిరి, జూన్ 12: తెలంగాణలో ఎం బీఏ, ఎంసీఏ కోర్సులో ప్రవేశానికి నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన టీజీ ఐసెట్-2026 ఫలితాలు శుక్రవారం హైదరాబాద్లోని రాష్ట్ర ఉన్నత విద్యా మండలిలో విడుదల చేశారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి టీజీ ఐసెట్ చైర్మన్, ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, కన్వీనర్ అల్వాల రవితో కలిసి ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మే 13, 14న నిర్వహించిన పరీక్షలకు 51,146 మంది అభ్యర్థులు హాజరుకాగా 46, 654 మంది ఉత్తీర్ణత సాధించారు.
