
(శ్రీరామ్ చక్రి న్యూస్)19/6/2026,టుడే న్యూస్ మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ సర్కిల్ 60వ డివిజన్ మీర్పేట్ పరిధిలోని జిల్లెలగూడ మంత్రాల చెరువు వద్ద బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై బీజేపీ మహిళా నాయకురాలు చేసిన అనుచిత వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకురాళ్లు సునీత బాలరాజ్, లలిత జగన్ మాట్లాడుతూ.. సబితా ఇంద్రారెడ్డి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకురాలని, ప్రజా సేవలో విశేష కృషి చేసిన వ్యక్తిపై అవగాహన లేకుండా విమర్శలు చేయడం సరికాదన్నారు. సబితా ఇంద్రారెడ్డిపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని, ప్రతి ఒక్కరూ తమ స్థాయిని గుర్తించి మాట్లాడాలని హెచ్చరించారు.అదేవిధంగా మాజీ కార్పొరేటర్ పై మహిళా నాయకులు మండిపడ్డారు. సబితా ఇంద్రారెడ్డిపై వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని హెచ్చరించారు. ఇలాంటి వ్యాఖ్యలు, చర్యలు పునరావృతమైతే సంబంధిత నాయకురాలి ఇంటిని ముట్టడిస్తామని మహిళా నాయకురాళ్లు హెచ్చరించారు. అవసరమైతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో మహిళా నాయకురాళ్లు అనిత, లత, నిర్మల, బిందు, పద్మలతో పాటు బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ నాయక్, భూపేష్ గౌడ్, అనిల్ కుమార్ యాదవ్, లక్ష్మణ్ ముదిరాజ్, దయానంద్ ముదిరాజ్, గోపి యాదవ్, హథితీరం నాయక్, వెంకటేశ్ కూర్మ, రామకృష్ణ, శ్రీశైలం యాదవ్, రజనీకాంత్ ముదిరాజ్, బాల్రాజ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
