
(శ్రీరామ్ చక్రి న్యూస్):బాలాపూర్, జూన్ 17: మహేశ్వరం నియోజకవర్గంలోని జీహెచ్ఎంసీ పరిధి బాలాపూర్ డివిజన్లోని బాలాపూర్ గ్రామంలో ఈ నెల 25వ తేదీ నుంచి జరగనున్న ప్రతిష్టాత్మక బొడ్రాయి పండుగ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బొడ్రాయి మహోత్సవ విగ్రహాన్ని గ్రామానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పూజా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ వైస్ చైర్మన్ చిగిరింత నరసింహ రెడ్డి పాల్గొని బొడ్రాయి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, బొడ్రాయి పండుగ వైభవంగా, విజయవంతంగా జరగాలని ఆకాంక్షించారు.గ్రామ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వేడుకలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బొడ్రాయి ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
