
ముత్యాలమ్మ విగ్రహ పుణ ప్రతిష్ట
హైదరాబాద్ న్యూస్ (శ్రీరామ్ చక్రి న్యూస్ )3-5-2026,మీర్ పేట్ కమల నెహ్రూ నగర్ కాలనీలోని ముత్యాలమ్మ దేవాలయంలో విగ్రహ పుణ ప్రతిష్ట కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఇంచార్జ్, మహేశ్వరం నియోజకవర్గ కాంటెస్ట్ ఎమ్మెల్యే అందెల శ్రీ రాములు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు శివ శంకర్, దయానంద్, కుమార్, అంజన్, కృష్ణ, శ్రీకాంత్, శివ తదితరులు శ్రీ రాములు గారితో పాటు బీజేపీ నాయకులను శాలువాలతో సన్మానించారు.
కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు తులసి ముకేష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి సిద్దాల శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, అనిత, సోమేశ్వర్, గాజుల మధు, తులసి వెంకటేశ్వర్లు, గోపీనాథ్, రమేష్, మల్లికార్జున్, రాఘవేంద్ర, వంటేరు నరసింహ రెడ్డి, రవీందర్ రెడ్డి, రఘు, శశి, శ్రీను, నిఖిల్, పవన్, భారత్, వంశీ తదితరులు పాల్గొన్నారు.
