
వికలాంగుడికి ఉచిత కృత్రిమ చేయి అందజేత
హైదరాబాద్, మే 3 (శ్రీరామ్ చక్రి న్యూస్): నారాయణ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత లింబ్ మరియు కాలిపర్ కొలతల కార్యక్రమంలో భాగంగా జిల్లెలగూడకు చెందిన మహేష్‌కు కృత్రిమ ఎడమ చేయి అందజేశారు. ఫిబ్రవరి 1న చంపపేట్ మినర్వా గార్డెన్లో జరిగిన శిబిరంలో ఆయన కొలతలు ఇవ్వగా, ఆదివారం పరికరాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండ విశ్వేశ్వర్ రెడ్డి, వారి బృందం, నారాయణ సేవా సంస్థకు మీర్పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు తులసి ముకేష్ ముదిరాజ్ కృతజ్ఞతలు తెలిపారు.
