గణపురం మండలంలో భార్యను చంపిన ఓ వ్యక్తి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. గణపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన సంధ్య, బాలాజీ రామాచారి భార్యాభర్తలు.

దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సంధ్యకు తాడుతో ఉరిపెట్టి చంపేశాడు. అనంతరం తానూ ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. సంధ్యను చంపిన తర్వాత భార్య, కూతురు వేధింపులు తాళలేక హత్య చేసినట్లు వీడియో తీసి వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకున్నాడు.
