ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములపై మహిళలు ప్రభావం చూపనున్నారు. ఎన్నికల ఫలితాల్లో ‘ఆమె’ తీర్పు ప్రధానంకానుంది.

మొదటి విడత పోలింగ్ పూర్తి కాగా రేపు ఆదివారం రెండోవిడత పోలింగ్ జరగనుంది. మూడో విడత ఈ నెల 17వ తేదీతో పంచాయతీ ఎన్నికల పోరు ముగియనుంది. జిల్లాలో మొత్తం ఓటర్లు 6,69,048 మంది ఉండగా వీరిలో పురుషులు 3,25,045 మంది, మహిళలు 3,43,979 మంది, ఇతరులు 24 మంది ఉన్నారు.
ఇదిలాఉంటే ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో సగం మంది మహిళలు బరిలో నిలిచారు. అభ్యర్థులంతా మహిళా ఓటర్లను ఆకర్షించుకునేందకు ప్రత్యేక దృష్టి పెట్టారు. వారి ఆశీస్సులు ఉంటే విజయం సులభమవుతుందని భావించిన రాజకీయ పార్టీలు సైతం మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నాయి. ఎక్కడచూసినా మహిళా ఓటర్ల ప్రాముఖ్యత కనిపిస్తుంది.
