ట్రంప్ ఆరోపణల్ని ఇరాన్ ఖండించింది. తాము ఈ దాడులకు పాల్పడలేదని తెలిపింది. ఎలాంటి ఆధారాలు లేకుండా డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు చేస్తున్నారని ఇరాన్ ప్రకటించింది.

భారత నౌకలపై ఇటీవల హార్ముజ్ జలసంధి వద్ద జరిగిన దాడిపై ఇరాన్, అమెరికా పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ దాడికి కారణం ఇరాన్ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే, ట్రంప్ ఆరోపణల్ని ఇరాన్ ఖండించింది. తాము ఈ దాడులకు పాల్పడలేదని తెలిపింది. ఎలాంటి ఆధారాలు లేకుండా డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు చేస్తున్నారని ఇరాన్ ప్రకటించింది. ఇండియాలోని ఇరాన్ రాయబార కార్యాలయం శనివారం ఈ ప్రకటన చేసింది.
