భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 ట్రాన్స్పోర్ట్ విమానం ఇవాళ కూలింది. అస్సాంలోని జోర్హాట్లో ఉన్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ల్యాండింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

గౌహతి: భారతీయ వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 ట్రాన్స్పోర్ట్ విమానం(AN-32 Transport Aircraft) ఇవాళ కూలింది. అస్సాంలోని జోర్హాట్లో ఉన్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ల్యాండింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. విమానం కూలిన తర్వాత మంటలు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన ప్రదేశానికి ఎమర్జెన్సీ బృందాలు చేరుకున్నాయి. మంటల్ని అదుపు చేస్తున్నారు. అయితే దేని వల్ల ప్రమాదం జరిగిందో ఇంకా తెలియడం లేదు.
