

మీర్పేట్, జూన్ 17 (శ్రీరామ్ చక్రి న్యూస్): GHMC 60వ డివిజన్ పరిధిలోని: మహేశ్వరం నియోజకవర్గంలోని జిల్లెలగూడ పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ పాఠశాలను బీజేపీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జ్ అందెల శ్రీరాములు బుధవారం సందర్శించారు. స్థానిక బీజేపీ నాయకులతో కలిసి పాఠశాలను పరిశీలించిన ఆయన, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం శ్రీ పథకం ద్వారా విద్యా రంగంలో గణనీయమైన మార్పులు తీసుకురావడం జరుగుతోందన్నారు.చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 21 పాఠశాలలు పీఎం శ్రీ పథకానికి ఎంపిక కాగా, మహేశ్వరం నియోజకవర్గంలో ఆరు పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. జిల్లెలగూడ పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు రెండేళ్ల కాలానికి రూ.33 లక్షలకు పైగా నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు. ఈ నిధులతో డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, సైన్స్ ల్యాబ్‌లు, క్రీడా సదుపాయాలు, కరాటే శిక్షణ, సమ్మర్ క్యాంపులు, సీసీ కెమెరాలు వంటి ఆధునిక వసతులు కల్పించనున్నట్లు వివరించారు.అనంతరం పాఠశాలలో అమలవుతున్న పీఎం పోషణ్ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక మెనూను రూపొందించిందని తెలిపారు. వారంలో మూడు రోజులు గుడ్డు, అరటిపండు, రెండు రోజులు ఆకుకూరలతో కూడిన ఆహారం అందించాలని సూచించారు.పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య, పోషకాహారం అందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ బీజేపీ అధ్యక్షుడు తులసి ముకేశ్ ముదిరాజ్, పసునూరి భిక్షపతి చారి, రాష్ట్ర, జిల్లా నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ మోర్చాల నాయకులు పాల్గొన్నారు.
