బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోని ఉదయ్‌నగర్‌లో తాగునీటి సమస్యలను పరిష్కరించాలంటూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో స్థానికులు జలమండలి కార్యాలయాన్ని ముట్టడించారు

బంజారాహిల్స్,మే 26: బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోని ఉదయ్‌నగర్‌లో తాగునీటి సమస్యలను పరిష్కరించాలంటూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో స్థానికులు జలమండలి కార్యాలయాన్ని ముట్టడించారు. మంగళవారం బంజారాహిల్స్ రోడ్ నెం 7లోని జలమండలి కార్యాలయం వద్ద బీఆర్ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత శ్రీనివాసునాయుడు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ విప్లవ్కుమార్తో పాటు సీనియర్ నేతలు, కార్యకర్తలు బైఠాయించారు. సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
