కర్నాటక రాజకీయ ముఖచిత్రం నాటకీయ మలుపు తిరగబోతోంది. ఢిల్లీలో పార్టీ హైకమాండ్‌తో సుదీర్ఘ చర్చల అనంతరం ముఖ్యమంత్రి సిద్దరామయ్య గురువారం తన రాజీనామాను సమర్పించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

హైదరాబాద్ : కర్నాటక రాజకీయ ముఖచిత్రం నాటకీయ మలుపు తిరగబోతోంది. ఢిల్లీలో పార్టీ హైకమాండ్‌తో సుదీర్ఘ చర్చల అనంతరం ముఖ్యమంత్రి సిద్దరామయ్య గురువారం తన రాజీనామాను సమర్పించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. సిద్ధ రామయ్య స్థానంలో డీకే శివకుమార్‌ను కాంగ్రెస్ హైకమాండ్ నియమించవచ్చనే ఊహాగానాలు తీవ్రమయ్యాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ కర్నాటక అగ్ర నాయకుల మధ్య దాదాపు ఏడు గంటల పాటు జరిగిన సమావేశాల అనంతరం ఈ ఉత్కంఠభరితమైన రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
