
(శ్రీరామ్ చక్రి న్యూస్) 15/6/2026, సరూర్‌నగర్, న్యూస్ టుడే: సరూర్‌నగర్‌లోని బంగారు మైసమ్మ దేవాలయంలో ధన్వంతరి నారాయణ ఆలయ ముఖద్వారానికి గోల్డ్ కలర్ తాపడం కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. సుమారు రూ.3.50 లక్షల వ్యయంతో దాతల సహకారంతో రూపొందించిన ఈ తాపడాన్ని టీపీసీసీ జనరల్ సెక్రటరీ, తెలంగాణ పర్యాటక సంస్థ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ప్రారంభించారు.బంగారు మైసమ్మ కాశీ వైద్యనాథ దేవస్థానం ఫౌండర్ ట్రస్టీలు బేర బాలకిషన్, ఆకుల అరవింద్ కుమార్ సమక్షంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ దేవాలయంలో ప్రతిరోజూ సుమారు 200 మందికి నిత్య అన్నదానం నిర్వహించడం అభినందనీయమన్నారు. హిందూ ధర్మ పరిరక్షణతో పాటు దేవాలయ అభివృద్ధికి ట్రస్టీలు చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.దేవాలయ అభివృద్ధికి తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సరూర్‌నగర్, కొత్తపేట, గడ్డి అన్నారం ప్రాంతాలకు చెందిన ఆర్యవైశ్య సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం 500 మందికి పైగా భక్తులకు అన్నదాన ప్రసాదం పంపిణీ చేశారు.
