అమెరికా, ఇరాన్ దౌత్యవేత్తల మధ్య సోమవారం ఇస్లామాబాద్‌లో చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆదివారం పాకిస్థాన్ రాజధానికి దౌత్యవేత్తలు చేరుకుంటారని అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు అమెరికా, ఇరాన్ మధ్య తొలి దఫా చర్చలు జరిగిన విషయం తెలిసిందే.

టెహ్రాన్: అమెరికా, ఇరాన్ దౌత్యవేత్తల మధ్య సోమవారం ఇస్లామాబాద్‌లో చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆదివారం పాకిస్థాన్ రాజధానికి దౌత్యవేత్తలు చేరుకుంటారని అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు అమెరికా, ఇరాన్ మధ్య తొలి దఫా చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఉద్రిక్తతలు తగ్గించే నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గల్ఫ్ దేశాల్లో పర్యటించారు. ఖతార్ షేక్ తమిమ్ బిన్ హమ్మద్, టర్కీ అధ్యక్షుడు రీసెప్ తయ్యిప్ ఎర్డగోన్ను కలిశారు. ఇక పాక్ ఆర్మీ చీఫ్ , ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ఇరాన్లో పర్యటించారు. ఆ దేశ విదేశాంగ మంత్రి అరగాచితో సంప్రదింపులు చేశారు.
