
శ్రీరామ్ చక్రి న్యూస్ 4/6/2026 వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో వరికోత మిషన్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం, రైతు పొలంలో వరి కోత పనులు కొనసాగుతుండగా హార్వెస్టర్ మిషన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఎండ తీవ్రత కారణంగా షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదం సంభవించినట్లు స్థానికులు భావిస్తున్నారు.సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చినప్పటికీ, ఫైర్ ఇంజన్ ఘటనాస్థలికి చేరుకునేలోపే హార్వెస్టర్ ముందు భాగం పూర్తిగా అగ్నికి ఆహుతైంది.ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించినప్పటికీ, యంత్రానికి భారీ నష్టం వాటిల్లింది.
