పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ వైపు అమెరికా, ఇరాన్ చర్చలు జరుపుతూనే మరో వైపు రెండు దేశాలు పరస్పరం దాడులకు పాల్పడుతున్నాయి.

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ వైపు అమెరికా, ఇరాన్ చర్చలు జరుపుతూనే మరో వైపు రెండు దేశాలు పరస్పరం దాడులకు పాల్పడుతున్నాయి. తాజాగా ఒమన్ గల్ఫ్‌లో ఒక అమెరికా(America) డిస్ట్రాయర్‌ను లక్ష్యంగా చేసుకొని దాడికి పాల్పడినట్లు ఇరాన్ నౌకాదళం పేర్కొంది. ఇరాన్ వాణిజ్య నౌకాయానానికి వ్యతిరేకంగా అమెరికా తీసుకుంటున్న చర్యలకు ఆ నౌక ‘కమాండ్-అండ్-కంట్రోల్ సెంటర్’గా పనిచేస్తోందని ఆరోపించింది.
