గోదావరి తీరం ఆనుకొని ఉన్న ధర్మపురి మండలంలో ఇసుక దందా జోరుగా సాగుతున్నది. నది ఒడ్డున ఉన్న ఆరెపల్లి గ్రామం అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. ఈ గ్రామ ఒడ్డు నుంచి అవతలి ఒడ్డు దాకా దాదాపు రెండుకిలోమీటర్లకు పైనే నది వెడల్పు ఉంటుంది.

ధర్మపురి, మే 29: గోదావరి తీరం ఆనుకొని ఉన్న ధర్మపురి మండలంలో ఇసుక దందా జోరుగా సాగుతున్నది. నది ఒడ్డున ఉన్న ఆరెపల్లి గ్రామం అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. ఈ గ్రామ ఒడ్డు నుంచి అవతలి ఒడ్డు దాకా దాదాపు రెండుకిలోమీటర్లకు పైనే నది వెడల్పు ఉంటుంది. ఇదే అక్రమార్కులకు వరంలా మారింది. మండలంలో ఈ గ్రామం చివరగా ఉండడంతో ఎంతతోడుకుంటే అంతఅన్నట్టు హద్దు లేకుండా పోయింది. ప్రస్తుతం వేసవి కావడంతో ప్రవాహం తగ్గడం, నది ఒకటి, రెండు పాయలుగా మాత్రమే ప్రవహిస్తుండడంతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ట్రాక్టర్లు, డోజర్లను అవలీలగా నదిలోకి దించి, పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుకను ఎడాపెడా తోడేస్తున్నారు.
