గీతకార్మికుల వృత్తి ప్రమాదకరమైనదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా గీతకార్మికులను ఆదుకోవాలని, అగ్నిప్రమాదాలకు గురైన తాటి, ఈత వనాలకు పరిహారం అందించాలని సూచించారు.

జగిత్యాల రూరల్, మే 29: అన్నింటికన్నా గీతకార్మికుల వృత్తి ప్రమాదకరమైనదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా గీతకార్మికులను ఆదుకోవాలని, అగ్నిప్రమాదాలకు గురైన తాటి, ఈత వనాలకు పరిహారం అందించాలని సూచించారు. జగిత్యాల రూరల్ మండలంలోని పొరండ్ల, కన్నాపూర్ గ్రామాల్లో కాలిపోయిన ఈత, తాటివనాలను శుక్రవారం ఆయన పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
