కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం రైతన్నకు శాపంగా మారుతున్నది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి రెండు నెలలైనా కొనకపోవడంతో ఆరుగాలం కష్టం నీళ్లపాలవుతున్నది

ఎల్లారెడ్డిపేట/ వేములవాడరూరల్/ కోనరావుపేట, జూన్ 8: కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం రైతన్నకు శాపంగా మారుతున్నది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి రెండు నెలలైనా కొనకపోవడంతో ఆరుగాలం కష్టం నీళ్లపాలవుతున్నది. రెండు రోజుల నుంచి పడుతున్న వర్షాలతో నష్టం వాటిల్లుతున్నది. ఆదివారం సాయంత్రం తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలుచోట్ల పడిన వానకు.. ఎల్లారెడ్డిపేట మండలం గుండారం, తిమ్మాపూర్, జైసేవాలాల్ తండా, వేములవాడరూరల్ మండలం లింగంపల్లి, వట్టెంల, నూకలమర్రి, కోనరావుపేట మండలం నిజామాబాద్ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు తడిశాయి
