పచ్చని పల్లెలో డంప్ యార్డు చిచ్చు చెలరేగింది. ధర్మపురి పట్టణ డంప్ యార్డ్‌ను తిమ్మాపూర్ పంచాయతీ ఆధీనంలోని భూమిలో ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదంగా మారింది.

పచ్చని పల్లెలో డంప్ యార్డు చిచ్చు చెలరేగింది. ధర్మపురి పట్టణ డంప్ యార్డ్‌ను తిమ్మాపూర్ పంచాయతీ ఆధీనంలోని భూమిలో ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఒక వైపు గండి హనుమాన్ ఆలయం, మరో వైపు క్రీడా ప్రాంగణం ఉన్న నేపథ్యంలో గ్రామస్తుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఈ విషయంలో ఓ సీనియర్ నాయకుడు ‘అన్నా.. మా ఊరిలో డంప్ యార్డును చేయడం ఏంటి? ఈ నిర్ణయం సరికాదు. వెనక్కి తీసుకోండి’ అని కోరితే.. ‘ఈ నియోజకవర్గం నాది. నా ఇష్టం. ఎక్కడైనా ఏర్పాటు చేసుకుంట. చెప్పడానికి నువ్వెవరు?’ అని మంత్రి సీరియస్ అయినట్టు తెలిసింది. దీంతో ఇరువురి మధ్య విబేధాలు తలెత్తినట్టు సమాచారం కాగా, ఇటు గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
