
కాలనీలో రోడ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నామని, చిన్న చిన్న రెండు మూడు పనులు మిగిలి పోయాయి తెలిపారు. అవి త్వరలో పూర్తి చేస్తామన్నారు. మారెట్, బస్తీ దవాఖాన ఏర్పాటు చేశామని, 59 జీవో కింద పట్టాలు ఇచ్చామని, ఇంకా మిగిలిన కొంతమంది కి త్వరలోనే అందజేస్తామని హామీ ఇచ్చారు.బీడీ కార్మికులకు రూ.2వేల చొప్పున పింఛన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అన్నారు. కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లీబిడ్డ సంక్షేమానికి కృషిచేసినట్లు తెలిపారు.
