ఈ సీజన్లో ధాన్యం అనుకున్న దానికంటే 30శాతం ఎక్కువగా రావడంతో కొనుగోలు సమస్యలు తలెత్తాయని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన గనుల మంత్రి గడ్డం వివేక్ అన్నారు

గజ్వేల్, మే 31: ఈ సీజన్లో ధాన్యం అనుకున్న దానికంటే 30శాతం ఎక్కువగా రావడంతో కొనుగోలు సమస్యలు తలెత్తాయని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన గనుల మంత్రి గడ్డం వివేక్ అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఐవోసీ సమావేశ మందిరంలో 1053 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అంతకుముందు రూ. 2.56 కోట్లతో నిర్మించిన బస్వేను ప్రారంభించారు.
