పాలమూరు పల్లె గ్రామాలు సాగునీటి వనరులతో పునర్జీవం పోసుకున్నాయని, వలసలు వెళ్లిన వారంతా తిరిగి వారి..వారి గ్రామాల్లో ఆవాసాలు సుస్థిర పరుచుకున్నారని ప్రముఖ విశ్లేకుడు, తెలంగాణ ఉద్యమకారుడు వీ ప్రకాశ్ అన్నారు

వనపర్తి, మే 28 : గడచిన పదేండ్లలో పాలమూరు పల్లె గ్రామాలు సాగునీటి వనరులతో పునర్జీవం పోసుకున్నాయని, వలసలు వెళ్లిన వారంతా తిరిగి వారి..వారి గ్రామాల్లో ఆవాసాలు సుస్థిర పరుచుకున్నారని ప్రముఖ విశ్లేకుడు, తెలంగాణ ఉద్యమకారుడు వీ ప్రకాశ్ అన్నారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలో తొలి ఎమ్మెల్యే సురవరం ప్రతాపరెడ్డి 130వ జయంతి కార్యక్రమం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రకాశ్‌తోపాటు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యఅథితులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాశ్ మాట్లాడుతూ అస్థిత్వం అంటే మన మూలాలు, ఆచారాలు, వనరులు, ప్రాజెక్టులు, సంప్రదా యాలు, చారిత్రక కట్టడాలన్నారు. సరళాసాగర్ ప్రాజెక్టుతో సైఫన్ సిస్టంను వనపర్తికి తెచ్చారని, తెలంగాణ భారతదేశంలో కలువక ముందే సంస్థాన రాజులు వనపర్తిని దేశంలో కలిపారన్నారు.
