వరిధాన్యం రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా నిలువుదోపిడీ చేస్తుంది. కాంగ్రెస్ మార్క్ పాలన రైతులకు కష్టాలు తెచ్చిపెట్టింది.

నాగర్కర్నూల్, మే 28 : వరిధాన్యం రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా నిలువుదోపిడీ చేస్తుంది. కాంగ్రెస్ మార్క్ పాలన రైతులకు కష్టాలు తెచ్చిపెట్టింది. మక్క ధాన్యం అమ్మడానికి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు గాసిన రైతాంగానికి వరిధాన్యం విక్రయం మోయలేని భా రంగా మారింది. క్వింటా వరిధాన్యానికి మిల్లుర్లు 12 నుంచి 20కిలోల వరకు తరుగు తీస్తుండటంతో కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. ఇదేమి అన్యాయమని ప్రశ్నిస్తే ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నారు. ప్రభుత్వం(పౌర సరఫరాల శాఖ) ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలు బూ టకంగా మారాయి. తరుగు తీయడంపైన ఉన్నత స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు మౌనం పాటిస్తున్నారు. అంతిమంగా దోపిడీకి గురైన వరిధాన్యం పండించిన రైతుకు మాత్రం కన్నీళ్లు మిగులుతున్నాయి.
