కాంగ్రెస్ పాలనలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఆగమవుతున్నది. బతుకమ్మ చీరలను బంద్ పెట్టిన ప్రభుత్వం, ఇప్పుడు నూలు అందించడంలోనూ నిర్లక్ష్యం చూపుతున్నది.

రాజన్న సిరిసిల్ల, జూన్ 7 : కాంగ్రెస్ పాలనలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఆగమవుతున్నది. బతుకమ్మ చీరలను బంద్ పెట్టిన ప్రభుత్వం, ఇప్పుడు నూలు అందించడంలోనూ నిర్లక్ష్యం చూపుతున్నది. వస్త్ర పరిశ్రమకు కేంద్రమైన సిరిసిల్లలో కాకుండా.. వేములవాడలో టెస్కో ఆధ్వర్యంలో యారన్ డిపో (నూలు బ్యాంక్) ఏర్పాటు చేయడంతో అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. యారన్ సమయానికి అందివ్వక పోవడంతోపాటు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో వస్ర్తోత్పతి నిలిచిపోతున్నది.
