జొన్నలను కొనుగోలు చేసినప్పటికీ గోదాముల కొరత కారణంగా తరలింపు నిలిచిపోవడంతో ఆగ్రహించిన రైతులు ఆదివారం ఆదిలాబాద్ కలెక్టర్ చౌరస్తాలో వాహనాలతో రాస్తారోకో నిర్వహించారు.

ఎదులాపురం, జూన్ 7 : జొన్నలను కొనుగోలు చేసినప్పటికీ గోదాముల కొరత కారణంగా తరలింపు నిలిచిపోవడంతో ఆగ్రహించిన రైతులు ఆదివారం ఆదిలాబాద్ కలెక్టర్ చౌరస్తాలో వాహనాలతో రాస్తారోకో నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల నుంచి పంటను గోదాములకు తరలించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ తమ సమస్యను పరిషరించాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ వ్యవసాయ మారెట్లో జొన్నల కొనుగోళ్లు కొనసాగుతున్నప్పటికీ నిల్వ చేసేందుకు తగిన గోదాములు అందుబాటులో లేవు.
