డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇలాకాలో మరో భూ దందా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వానికి తక్కు వ ధర కలిగిన భూమి రూ.6 కోట్లకు కట్టబెట్టి ప్రజాధనాన్ని కొల్లగొట్టాలని స్కెచ్ వేయగా, డెవలప్మెంట్ కమిటీ సభ్యుల పరిశీలనతో బట్టబయలైంది.

మధిర, మే 27: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇలాకాలో మరో భూ దందా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వానికి తక్కు వ ధర కలిగిన భూమి రూ.6 కోట్లకు కట్టబెట్టి ప్రజాధనాన్ని కొల్లగొట్టాలని స్కెచ్ వేయగా, డెవలప్మెంట్ కమిటీ సభ్యుల పరిశీలనతో బట్టబయలైంది. ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీలో రూ.129 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీని భట్టి విక్రమార్క మంజూరు చేయించగా, పనులు జరుగుతున్నాయి. మధిరలో జరిగే అభివృద్ధి పను ల పర్యవేక్షణకు డిప్యూటీ సీఎం ‘డెవలప్మెంట్ కమిటీ’ని ఏర్పాటు చేశారు.
