భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం బొజ్జ తండా పంచాయతీ పరిధిలోని దండేల చెరువులో సుమారు పది టన్నుల చేపలు..

మృగశిర కార్తె రోజున మార్కెట్లో చేపలకు ఉండే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, విక్రయాల కోసం మత్స్యకారులు ఆదివారం సాయంత్రం చెరువులో చేపలను వేటాడారు. తాజా చేపలను అందించాలనే ఉద్దేశంతో వాటిని వలలోనే ఉంచి, చెరువులో ఒక మూలకు చేర్చారు. అయితే, ప్రస్తుత తీవ్ర ఎండల కారణంగా చెరువులోని నీరు ఒక్కసారిగా వేడెక్కింది. వలలో ఒకేచోట గుంపుగా ఉన్న చేపలు ఆ వేడి తీవ్రతను, ఆక్సిజన్ లేమిని తట్టుకోలేక ఊపిరాడక చనిపోయాయి.
