ఖైరతాబాద్ డబుల్ బెడ్రూం గృహాలకు నీటి కష్టాలు తీర్చేందుకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధి నిధులు కేటాయించినా.. జలమండలి అధికారుల నిర్లక్ష్యంతో ఆ ఫైలు ముందుకు సాగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఖైరతాబాద్, జూన్ 12 : ఖైరతాబాద్ డబుల్ బెడ్రూం గృహాలకు నీటి కష్టాలు తీర్చేందుకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధి నిధులు కేటాయించినా.. జలమండలి అధికారుల నిర్లక్ష్యంతో ఆ ఫైలు ముందుకు సాగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని హంగులతో ఖైరతాబాద్‌లోని ఇందిరానగర్‌కాలనీలో నాలుగు బ్లాకుల్లో 210 డబుల్ బెడ్రూం గృహాలను నిర్మించారు. అయితే అప్పటి అవసరాలకు జలమండలి ద్వారా సరఫరా అయ్యే నిల్వ చేసేందుకు భారీ ట్యాంకు, నీటికి ఇబ్బందులు కలుగకుండా అదనంగా బోరు సైతం ఏర్పాటు చేశారు.
