వేసవి సెలవులు ముగియడంతో ఇవాళ స్కూళ్లు పునఃప్రారంభమయ్యాయి. అయితే అమావాస్య రోజు పాఠశాలలు రీఓపెన్ కావడంతో మొదటి రోజు హాజరు శాతం భారీగా తగ్గింది.

వేసవి సెలవులు ముగియడంతో ఇవాళ స్కూళ్లు పునఃప్రారంభమయ్యాయి. అయితే అమావాస్య రోజు పాఠశాలలు రీఓపెన్ కావడంతో మొదటి రోజు హాజరు శాతం భారీగా తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో చాలా తక్కువ మంది విద్యార్థులపై హాజరయ్యారు. కొన్ని చోట్ల పదుల సంఖ్యలోనే విద్యార్థులు హాజరవ్వగా.. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం గీతానగర్లోని బాలికల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ఒక్కతే పాఠశాలకు వచ్చింది. తోటి క్లాస్మేట్స్ ఎవరూ లేకపోవడంతో ఆ విద్యార్థిని ఒంటరిగానే క్లాస్ రూంలో కూర్చుంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
