కూకట్పల్లి నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తమాషా చేస్తుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాలానగర్, జూన్ 12 : కూకట్పల్లి నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తమాషా చేస్తుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఓల్డ్‌బోయిన్‌పల్లి వార్డు కార్యాలయ ప్రాంగణంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి ఓల్డ్‌బోయిన్‌పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓల్డ్‌బోయిన్‌పల్లి, హస్మత్‌పేట డివిజన్లకు చెందిన ప్రజలు భారీగా సమస్యల వినతి పత్రాలు అధికారులకు అందజేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రజలు సమస్యలు తెలియజేయడం కోసం భారీగా తరలిరావడంతో అధికారులు అవాక్కయ్యారు. ప్రధానంగా శానిటేషన్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైందని, డ్రైనేజీ వ్యవస్థ పేరుకుపోయిందని, తాగునీరు సక్రమంగా రావడం లేదని, రోడ్లు వేయాలని ప్రజలు కోరారు
