
శ్రీరామ్ చక్రి న్యూస్) | మహేశ్వరం | 11-06-2026 రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మహేశ్వరం మండలం దబిల్గూడా గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు బీజేపీ పార్లమెంటరీ విప్, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి హాజరయ్యారు.ఎంపీ లాడ్స్ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా వినియోగిస్తున్నట్లు తెలిపారు.
అదేవిధంగా దబిల్గూడా గ్రామ సర్పంచ్ బుగ్గని యాదమ్మ, యాదయ్య దంపతులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తమ సొంత నిధులతో గ్రామ ప్రజల అవసరాల కోసం మంచినీటి ఫిల్టర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఈ ఫిల్టర్ ప్లాంట్ ద్వారా గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి రానుంది.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
