హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. జిమ్ ఓనర్‌ను ఓ వ్యక్తి తుపాకితో కాల్చి చంపాడు. జనం మధ్యలో.. జిమ్ ముందు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.

హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. జిమ్ ఓనర్‌ను ఓ వ్యక్తి తుపాకితో కాల్చి చంపాడు. జనం మధ్యలో.. జిమ్ ముందు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హన్సికి చెందిన కపిల్ అనే యువకుడు పవారా చౌక్‌లో జిమ్ నడుపుతున్నాడు. గురువారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో జిమ్ దగ్గరకు వచ్చాడు. జిమ్‌కు వచ్చిన వారితో జిమ్ ముందు ఉన్న మెట్లపై వార్మ్ అప్ చేయించసాగాడు.
