రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని తాటిపర్తి గ్రామంలో జరుగుతున్న ఫార్మా పనులను రైతులు అడ్డుకున్నారు.

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని తాటిపర్తి గ్రామంలో జరుగుతున్న ఫార్మా పనులను రైతులు అడ్డుకున్నారు. అక్రమంగా ఫార్మా భూముల్లో చదును చేసేందుకు గ్రామానికి పదుల సంఖ్యలో వచ్చిన జేసీబీలు, డోజర్లను అడ్డుకున్నారు. కోర్టు స్టే ఉన్న భూముల్లో ఎలాంటి పనులు చేయొద్దని స్థానిక ప్రజలు బుల్డోజర్లను వెనక్కి పంపారు.
