రంగారెడ్డిజిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణలో అన్నదాతల అంగీకారం లేకుండానే సర్కారు బలవంతంగా భూములను స్వాధీనం చేసుకోవడానికి సిద్ధమైంది. తమ భూములను బలవంతంగా తీసుకోవద్దని, తమ జీవనాధారమైన భూములు తీసుకుంటే తాము రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు వేడుకుంటున్నా అధికారులు వినిపించుకునే పరిస్థితి లేదు.

రంగారెడ్డిజిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణలో అన్నదాతల అంగీకారం లేకుండానే సర్కారు బలవంతంగా భూములను స్వాధీనం చేసుకోవడానికి సిద్ధమైంది. తమ భూములను బలవంతంగా తీసుకోవద్దని, తమ జీవనాధారమైన భూములు తీసుకుంటే తాము రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు వేడుకుంటున్నా అధికారులు వినిపించుకునే పరిస్థితి లేదు. బలవంతంగా తమ భూముల్లో పనులు చేపట్టడానికి వచ్చిన అధికారులను అడ్డుకుంటే అన్నదాతలపై కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో రంగారెడ్డిజిల్లాలో భూ బాధితుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
