పాలమూరు జిల్లా కేంద్రంలోని నడిబొడ్డున ఎస్పీ కార్యాలయం , డీఎస్పీ కార్యాలయం, టుటౌన్ పోలీస్‌స్టేషన్ కూతవేటు దూరంలో ఉన్న తెలంగాణ చౌరస్తా వద్ద మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు ఏటీఎం సెంటర్లోకి చొరబడి స్టేట్‌బ్యాంక్ ఏటీఎం మిషన్‌ను బొలెరో వాహనంలో ఎక్కించి యథేచ్ఛగా ఎ త్తుకెళ్లిన ఘటన కలకలం రేపుతోంది.

మహబూబ్‌నగర్, మే 26 : పాలమూరు జిల్లా కేంద్రంలోని నడిబొడ్డున ఎస్పీ కార్యాలయం , డీఎస్పీ కార్యాలయం, టుటౌన్ పోలీస్‌స్టేషన్ కూతవేటు దూరంలో ఉన్న తెలంగాణ చౌరస్తా వద్ద మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు ఏటీఎం సెంటర్లోకి చొరబడి స్టేట్‌బ్యాంక్ ఏటీఎం మిషన్‌ను బొలెరో వాహనంలో ఎక్కించి యథేచ్ఛగా ఎ త్తుకెళ్లిన ఘటన కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వివరాల ప్రకారం తెలంగాణ చౌరస్తాలో తెల్లవారుజామున 2:25 గంటల సమయంలో గుర్తుతెలియని దొంగలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎంను ధ్వంసం చేసి మిషన్‌ను తాళ్లతో కట్టి వాహనంలోకి ఎక్కించి ఎత్తుకెళ్లారు.
