గద్వాల మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. ప్రభుత్వ భూముల్లో అడ్డగోలుగా తవ్వకాలు చేపడుతూ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు.

గద్వాల మండలంలో గతంలో నదిఅగ్రహారం, అనంతపురం, జమ్మిచేడ్ తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో మట్టిని అడ్డగోలుగా తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం వారంరోజులుగా గద్వాల మండలం ముల్కలపల్లి గ్రామ శివారులో చెరువు పక్క నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఎవరికి కనిపించని విధంగా మట్టి మాఫియా గుట్టలను స్వాహా చేస్తూ వందల టిప్పర్ల మట్టిని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నా రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తుంది. మట్టి మాఫియాను గ్రామస్తులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వారిని మీ అంతూ చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. అడ్డగోలు తవ్వకాల ఈ విషయం అధికారులకు తెలియకపోవడం కోసమెరుపు.
