మీడియా పట్ల కేంద్ర సర్కారు అసహనంతో వ్యవహరిస్తున్నదని, ఇది ఆందోళనకరమైన అంశమని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా పేర్కొన్నది

న్యూఢిల్లీ: కేంద్ర సర్కారు మీడియా పట్ల తీవ్ర అసహనంతో వ్యవహరిస్తున్నదని, ఇది ఆందోళనకరమైన అంశమని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా పేర్కొన్నది. ఇటీవల యూరోప్ పర్యటనలో స్థానిక జర్నలిస్టులు ప్రధాని మోదీని ప్రశ్నించారు. కానీ ఆయన వారికి సమాధానం ఇవ్వలేదు. ఇక భారతీయ అధికారులు కూడా అక్కడ జర్నలిస్టులకు కౌంటర్ ఇచ్చే రీతిలో వ్యవహరించిన విషయం తెలిసిందే. నార్వే, నెదర్లాండ్స్ జర్నలిస్టులకు ప్రధాని మోదీ సమాధానం ఇవ్వకపోవడం పట్ల ఎడిటర్స్ గిల్డ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆదివారం ఈ ఘటన పట్ల ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది.
