డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనం కావడం అనేది ఎక్కువగా చమురు దిగుమతులు, స్టాక్ మార్కెట్లు, వాణిజ్యలోటు కోణంలోనే చర్చకు వస్తున్నది.

న్యూఢిల్లీ: డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనం కావడం అనేది ఎక్కువగా చమురు దిగుమతులు, స్టాక్ మార్కెట్లు, వాణిజ్యలోటు కోణంలోనే చర్చకు వస్తున్నది. కానీ విదేశీ డిగ్రీ, చదువు తర్వాత మంచి ఆదాయం సంపాదించాలనే కలలతో ఇండ్లను వదిలివెళ్లిన లక్షలాది భారతీయ విద్యార్థులను సైతం ఇది తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. చదువు కంటే ఎక్కువగా రోజులు ఎలా గడుపాలన్న ఆలోచనలతో విద్యార్థులు సతమతమవుతున్నారు. బలహీనపడుతున్న రూపాయి విలువ విదేశాల్లో ఉన్న అనేక మంది భారతీయ విద్యార్థులను బతుకడానికి బడ్జెట్ వేసుకునేలా చేసింది.
