మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభానికి బీఆర్ఎస్ సర్పంచులను పిలిచి అవమానించిన ఘటన పెద్దకొత్తపల్ల్లిలో చోటుచేసుకున్నది. దీంతో సర్పంచులు అధికారుల తీరుపై ఆగ్ర హం వ్యక్తం చేస్తూ డీఆర్డీవో రాజేశ్వరికి రాత పూర్వకంగా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు.

బీఆర్ఎస్ సర్పంచులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు పెద్దకొత్తపల్లి మండల కేంద్ర సర్పంచ్ బెట్టరి రేణుకతో పాటు మరి కొంత మందికి సింగిల్ విండో కార్యాలయం నుంచి ఆహ్వానం అందించారు. తీరా మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం సమయం కంటే ముందుగానే పెద్దకొత్తపల్లి సర్పంచ్ బెట్టరి రేణుక, కల్వకోలు గ్రామ సర్పంచ్ బంట్రోత్ శ్రీనివాస్, సాతాపూర్ గ్రామ సర్పంచ్ కట్టా వంశీగౌడ్, ఆదిరాల సర్పంచ్ కర్ణాకర్ రెడ్డిలు వస్తున్నారు అనే విషయం తెలుసుకొని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్, వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ దండు నరసింహ చేత ప్రారంభిం చినట్లు తెలిపారు.
