వడదెబ్బకు తనయుడు మృతి చెందగా, పుత్రశోకంతో తల్లడిల్లిన తల్లి రోదిస్తూ కుప్పకూలి గుండెపోటుకు గురై మృతి చెందిన ఘటన గురువారం మండలంలోని తూంకుంట గ్రామంలో చోటు చేసుకొన్నది.

అయిజ, ఏప్రిల్ 16 : వడదెబ్బకు తనయుడు మృతి చెందగా, పుత్రశోకంతో తల్లడిల్లిన తల్లి రోదిస్తూ కుప్పకూలి గుండెపోటుకు గురై మృతి చెందిన ఘటన గురువారం మండలంలోని తూంకుంట గ్రామంలో చోటు చేసుకొన్నది. గ్రామస్తుల కథనం మేరకు.. అయిజ మండలంలోని తూంకుంట గ్రామానికి చెందిన కుర్వ మల్లికార్జున్ (42)కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం పొలం పనుల నిమిత్తం వెళ్లారు. ఉదయం 11 గంటల సమయంలో ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురై పొలంలోనే కుప్పకూలాడు. వెంటనే గ్రహించిన కుటుంబ సభ్యులు అయిజకు తరలించారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. మృతుని భౌతికాయాన్ని గ్రామానికి తరలించగా, కల్లెదుటే కన్న కొడుకు మృత్యువాత పడటంతో శోకసంద్రంలో మునిగి రోదిస్తూ తల్లి రంగమ్మ (63) కుప్పకూలి పడిపోయింది.
