స్థానిక సమరం రోజురోజుకీ హీట్ ఎక్కుతుంది. రాజకీయ పార్టీల బీఫాములు అవసరం లేకున్నా ఒక్కో రాజకీయ పార్టీ నుంచి ఒక్కో గ్రామంలో ముగ్గురు నుంచి అయిదుగురు ఆశావాహులు సర్పంచ్ స్థానాలకు పోటీకి సిద్ధమవుతున్నారు.

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్ లో మొదటిసారిగా సర్పంచ్ స్థానం జనరల్‌కు కేటాయించారు. దీంతో ఓసీ వర్గానికి చెందిన కులస్తులు మొదటిసారి తమకు అవకాశం వచ్చిందని, సబ్బండ వర్గాలు తమను ఆశీర్వదించాలని విన్నవిస్తున్నారు. అయితే ఇందులో ప్రధానంగా బీసీలు పోటాపోటీగా బరిలోకి దిగుతున్నారు
