పట్టణంలోని ఐలాపూర్ రోడ్డు రహదారిని మున్సిపల్, రోడ్లు భవనాల శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే శుక్రవారం పరిశీలించారు.

కోరుట్ల పట్టణంలోని ఐలాపూర్ రోడ్డు రహదారి నిర్మాణానికి కృషి చేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తెలిపారు. పట్టణంలోని ఐలాపూర్ రోడ్డు రహదారిని మున్సిపల్, రోడ్లు భవనాల శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే రహదారి పూర్తిగా దెబ్బతిన్నదని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. రహదారి పునరుద్ధరణకు అవసరమైన నిధులను సమీకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
