
ఎల్బీనగర్ నియోజకవర్గం :ఆర్కేపురం,డివిజన్: అక్టోబర్ 18 (శ్రీరామ్ చక్రీ న్యూస్)దసరా పండుగను పురస్కరించుకొని ఆర్కేపురం డివిజన్ పరిధిలోని మహిళా కార్మికులకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చిలుక మధుర ఉపేందర్రెడ్డి చీరలు పంపిణీ చేశారు. పారిశుద్ధ్య కార్మికులతోపాటు దేవాలయాల్లో పనిచేస్తున్న మహిళలకు పండుగ కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం సమాజ సేవలో నిమగ్నమయ్యే మహిళా కార్మికుల సేవలు అభినందనీయమన్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా దసరా కానుకగా చీరలు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. సమాజానికి సేవలందించే వారిని ఆదుకోవడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని చిలుక మధుర ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు.
