విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం దసరా ఉత్సవాలకు సిద్ధమైంది. సోమవారం నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు తిధుల ప్రకారం 11 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి

ప్రతి ఏడాది పది అవతారలలో దర్శనం ఇచ్చిన అమ్మ వారు ఈసారి 11వ ప్రత్యేక అవతారం కాత్యాయనీ దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల సందర్భంగా రూ.500 టికెట్లను రద్దు చేశారు. రూ.300, రూ.100 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపారు.
