
డిసెంబర్ 29 (శ్రీరామ్ చక్రి న్యూస్) రంగారెడ్డి జిల్లా.నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనర్ గా సాయంత్రం సుధీర్ బాబు, బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్బంగా ఆయనను పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఈ సందర్బంగా పోలీసు కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నేను ఈ రోజు ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందని, రాష్ట్ర అభివృద్ధిని ప్రపంచ దేశాలకు తెలిసేలా ఇటీవల గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించుకోవడం జరిగినదని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా కొత్తగా నాలుగు పోలీసు కమిషనరేట్లను ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో భాగంగా నేను ఈ రోజు ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందని అన్నారు. రాష్ట్ర అభివృద్దిలో తమ వంతు బాధ్యతలను నిర్వహిస్తామని అన్నారు.అన్నీ శాఖల సమన్వయంతో పని చేస్తామని, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో 22 పోలీసు స్టేషన్లు పని చేస్తాయని, ఈ పోలీసు స్టేషన్ల అధికారులతో కలిసి టీమ్ వర్క్ తో సమర్థవంతంగా పని చేస్తామని అన్నారు.నాకు ఈ అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
