నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరవాసులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కఠిన హెచ్చరికలు జారీ చేశారు.

మద్యం సేవించి వాహనాలు నడిపేవారి పట్ల ఏమాత్రం ఉపేక్షించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ మరియు రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా పోలీసులు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేశారు.ఈ సందర్భంగా పలు కీలక ప్రకటనలు చేశాడు.
ఈ రోజు రాత్రి నగరం అంతటా 120కి పైగా కీలక పాయింట్లలో ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించబోతున్నట్లు తెలిపాడు. ఈ తనిఖీలు కేవలం ఈ రోజుకే పరిమితం కాకుండా జనవరి మొదటి వారం అంతా కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే భారీ జరిమానా విధించడంతో పాటు, వాహనాన్ని సీజ్ చేస్తామని, అలాగే కోర్టు ద్వారా జైలు శిక్ష మరియు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే ప్రక్రియను చేపడతామని హెచ్చరించారు
