హైదరాబాద్కు చేరుకున్న దేప సురేఖ–భాస్కర్ రెడ్డి దంపతులు

హైదరాబాద్, మే 13:( శ్రీరామ్ చక్రీ న్యూస్)
మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన దేప సురేఖ–భాస్కర్ రెడ్డి దంపతులు తమ 40 రోజుల అమెరికా పర్యటనను ముగించుకుని బుధవారం ఉదయం హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న వారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అమెరికాలోని పలు నగరాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులతో సమావేశమైనట్లు తెలిపారు. తెలంగాణలో Revanth Reddy నాయకత్వంలో ప్రజాపాలన కొనసాగుతుండటం పట్ల ప్రవాస భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై ఎన్ఆర్ఐలు ఆసక్తి చూపుతున్నారని, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న సానుకూల వాతావరణం అభివృద్ధికి దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
